ఎస్ ఎస్ ఎఫ్ ధర్మప్రచారకుల శిక్షణ ముగింపు కార్యక్రమం

0
551

Times of Nellore (Tirupati) – జూన్ 22 నుండి 30 వరకు టీటీడీ, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో సమరత సేవా ఫౌండేషన్ కార్యకర్తల 5 వ బృందం, 70 మంది ధర్మ ప్రచారకుల 10 రోజుల శిక్షణా శిభిరం టీటీడీ శ్వేతాభవనం, తిరుపతి లో జరిగింది. జూన్ 30 సాయంత్రం 4 గంటలకు శ్వేతాభవనం లో జరిగిన శిక్షణ ముగింపు సమావేశంలో టీటీడీ కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ ఐ.ఏ.ఎస్ మాట్లాడుతూ… రాష్ట్రంలో ఎస్ ఎస్ ఎఫ్ జిల్లా,మండల,గ్రామ స్థాయి కార్యకర్తల పనితీరును అభినందించారు. ఎస్ ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో, టీటీడీ ఆర్ధిక సహాయంతో ఎస్సీ,ఎస్టీ, మత్స్యకార కాలనీలలో నిర్మాణమవుతున్న ఆలయాల నిర్మాణాన్ని తక్కువ సమయంలో పూర్తి చేస్తున్న ఎస్ ఎస్ ఎఫ్ కార్యకర్తలను అభినందించారు. గతంలో 8 లక్షల వ్యయంతో చేపట్టిన ఆలయాల నిర్మాణం ఇప్పటికి పూర్తికాలేదన్నారు. దివ్యదర్శనంలో ఎస్ ఎస్ ఎఫ్ కార్యకర్తలు సమర్ధవంతంగా పనిచేశారన్నారు. టీటీడీ, ఎస్ ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో నిర్మాణమయిన దేవాలయాలు కేంద్రంగా అక్కడ నివసించే విద్యార్థిని, విద్యార్థులకు అనేక కార్యక్రమాలు రూపొందించి, వారిని ధర్మం వైపు నడిపించే విధంగా ఎస్ ఎస్ ఎఫ్ కార్యకర్తలు కృషిచేయాలన్నారు. ఎస్సీ,ఎస్టీ,కాలనీ వాసులకు ఆధ్యాత్మికంగా అవసరమైన సాహిత్యాన్ని సరళ భాషలో టీటీడీ ద్వారా అందించే ప్రయత్నం చేయాలని ఎస్ ఎస్ ఎఫ్ కార్యకర్తలను కోరారు.ఎస్ ఎస్ ఎఫ్ లో పనిచేసే ధర్మ ప్రచారకులకు నిధులు సకాలంలో అందించి, వారి కుటుంబాలకు ఎటువంటి ఇబ్బంది లేడుండా చూడాలని,కోరారు. టీటీడీ ఆధర్యంలో నిర్మాణమయిన కల్యాణ మండపాలలో సంవత్సరానికి కనీసం 20 కల్యాణాలు జరగని మండపాలను గుర్తించి, వాటిని ఎస్ ఎస్ ఎఫ్ ద్వారా ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఎస్ వి బి సి ఛానల్ ద్వారా పండుగల విశిష్టత, పూజ విధానం సంవత్సరంలో వచ్చే ప్రతి పండుగకు ముందు ఛానల్ ద్వారా తెలియజేయాలని, ఎస్ వి బి సి ఛానల్ లో ప్రసారమవుతున్న సంస్కృతం నేర్చుకుందాం అం కార్యక్రమం మంచి ప్రోత్సాహకరంగా ఉందని అన్నారు. ఎస్ వి బి సి ఛానల్ లో పిల్లలకు యానిమేషన్ ద్వారా రామాయణ,భాగవత గాధలను చెప్పించాలని నిర్ణయించామన్నారు. ధర్మ ప్రచారానికి కావలసిన నిధులకు టీటీడీ కి కొదవలేదని, ఆనిధులను సరిఅయిన విధానంలో వినియోగిచుకోవాలన్నా, ఫలితాలను సరిగా పొందాలన్నా నిబద్ధతగా పనిచేసే ఎస్ ఎస్ ఎఫ్ కార్యకర్తలు టీటీడీ కి అవసరమని అన్నారు.గ్రామాలలో ఎస్సీ,ఎస్టీ,కాలనీలలో ఆదివారం చదువుకొని విద్యార్థులతో నిరంతరం ఆధ్యాత్మికత, సంస్కృతీ సంప్రదాయాల పట్ల అవగాహనా కలిగేటట్లు, వారు మంచి నడవడితో ఉండేటట్లు వారం వారం, నెల నెలా కార్యక్రమాలు రూపొందించాలని కోరారు.ఎస్ ఎస్ ఎఫ్ కమిటీ సభ్యులు, ధర్మ ప్రచాకులు గ్రామాలలో చేస్తున్న సేవలను అభినందించారు.

ఈ సందర్బంగా ఎస్ ఎస్ ఎఫ్ కోశాధికారి తాళ్లూరి విష్ణు గారు, ఈ ఓ గారికి సంస్థ పై విశ్వాసం ఉంచినందుకు అభినందనలు తెలుపుతూ గ్రామస్థాయిలో జరుగుతున్న అనేక ధార్మిక కార్యక్రమాల పట్ల సంతృప్తి తెలియజేయడం పై సంస్థ తరపున కృతఙ్ఞతలు తెలియజేసారు.అట్టడుగు వర్గాలలో ఆధ్యాత్మిక అవసరాలను గుర్తించి, సేవ చేయడానికి కావలసిన కొత్త ప్రణాళికలు రూపొందించిన ఆయనను అభినవ అంబెడ్కర్ గా అభివర్ణించారు. ఇప్పటి వరకు 480 దేవాలయాలలో ప్రతిష్టలు పూర్తయినాయని , మిగిలిన 20 దేవాలయాలను జులై 13 నాటికీ పూర్తి చేస్తామని, అన్ని దేవాలయాలకు అర్చక శిక్షణ పూర్తయిందని తెలిపారు.ఈ సంవత్సరం కొత్తగా నిర్మాణం చేయవలసిన 500 దేవాలయాలకు అనుమతులు ఇస్తూ, నిధులు విడుదల చేయవలసిందిగా కోరారు. పూర్తయిన 500 దేవాలయాలకు మైక్ సెట్లు, పల్లకీలు, గొడుగులు ,భజన బృందాలు, వాయిద్య సామాగ్రి అందించవలసిందిగా కోరారు. మండల ధర్మ ప్రచారకుల వివరాలు, గ్రామ, మండల, జిల్లా మహిళా మరియు పురుష కమిటీ ల పనితీరు సమాచారాన్ని అందజేశారు. ధర్మ ప్రచారకుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో టీటీడీ కార్య నిర్వహణాధికారి తో పాటు హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి, శ్రీ రమణ ప్రసాద్, శ్వేతా డైరెక్టర్ చంద్రశేఖర్ మండ, విద్యాభారతి ఉపాధ్యక్షులు దూసి రామకృష్ణ,, ఎస్ ఎస్ ఎఫ్ కోశాధికారి విష్ణు, తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY