ఈనెల 13నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

0
181

Times of Nellore ( Tirumala ) – ఈ నెల 13 నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని, ఇందు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీటీడీ ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్ తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ నవంబర్‌లో అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణం ప్రారంభిస్తామన్నారు. ఆన్‌లైన్‌ లక్కీడిప్‌ విధానంలో టీటీడీ పరంగా ఎలాంటి లోపాలు లేవని అయితే లక్కీడిప్ విధానంలో కేటాయించే టిక్కెట్లలో అవకతవకలు వాస్తవమే ఈవో అంగీకరించారు. ఒకే ఈ-మెయిల్ ఐడీ ద్వారా టికెట్లను పొందేవారి వివరాలు సేకరించామని చెప్పారు. అక్రమాలకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. 1952 నుంచి తిరువాభరణం రిజిస్టర్‌లో ఉన్నవిధంగా శ్రీవారి ఆభరణాలన్నీ భద్రంగా ఉన్నాయని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు.

SHARE

LEAVE A REPLY