సమరసత సేవా ఫౌండేషన్ “పూజ్య ధర్మాచార్య సదస్సు”

0
79

Times of Nellore (Vijayavada) #సూర్య#- సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడ లోని పెనమలూరు నందు పద్మావతి పరిణయ కల్యాణ మండపం లో గురువారం పూజ్య ధర్మాచార్యుల సదస్సు విజయవంతంగా జరిగింది.పై సదస్సులో పాల్గొన్న పీఠాధిపతులు,మఠాధిపతులు , ధార్మిక సంస్థల ప్రతినిధులు సమరసత సేవా ఫౌండేషన్ వారు చేస్తున్న పలు కార్యక్రమాల గురించి విస్తృతంగా చర్చించి అనేక ప్రతిపాదనలు ఏకగ్రీవంగా ఆమోదించారు. హిందూ సంస్కృతి పునర్వైభవానికి కృషి చేస్తూ, హిందూ ధర్మానికి చెందిన పూర్వ కళలపై సమరసత సేవా ఫౌండేషన్ ద్రుష్టి పెట్టుట, గడచినా మూడేళ్ళలో పలు హిందూ ధార్మిక కార్యక్రమాలలో ఎంతో వేగంగా ముందుకెళ్లడం అభినందనీయమని ప్రశంసించారు. మత మార్పిడులు క్రమంగా తగ్గడం తోపాటు ప్రజల్లో హిందూ సంస్కృతి పై శ్రద్ధ పెంచే విధంగా వారు చేస్తున్న కార్యక్రమాలు విశిష్టంగా ఉన్నాయని శ్లాఘించారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ఎస్ ఎస్ ఎఫ్ వారు చేస్తున్న సదరు ధార్మిక కార్యక్రమాలకు సహకరించాలని పలువురు పీఠాధిపతులు తీర్మానించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు సమరత సేవా ఫౌండేషన్ కు ఆంధిచిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. రానున్న కాలంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. గడిచిన మూడు సంవత్సరాల కాలంలో ఎస్ ఎస్ ఎఫ్ కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందించిన రాష్ట్రం లోని ఆయా ప్రాంతాల ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతాభివందనాలు తెలియజేశారు. ఇప్పటికే టీటీడీ, దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆర్ధిక సహకారంతో తక్కువ ఖర్చుతో రాష్ట్ర వ్యాప్తంగా 500 దేవాలయాలు షెడ్యూల్డ్ ట్రైబ్, షెడ్యూల్డ్ కాస్ట్, మత్స్యకారుల కాలనీలలో తక్కువ ఖర్చుతో పూర్తి చేసి అందరికి ఆదర్శంగా నిలిచారని, అలాగే భజన బృందాలకు శిక్షణ ఇచ్చి దేవాలయాలలో ప్రధానంగా భజన కార్యక్రమాలు నిర్వహించడం ప్రధాన భూమికగా శ్రీ పి వి ఆర్ కె ప్రసాద్ గారు, ఎం జి కె మూర్తి గారి ఆశయాలను అనుసరించి నడుస్తూ, షెడ్యూల్డ్ ట్రైబ్, షెడ్యూల్డ్ కాస్ట్, మత్స్యకారుల సంఘాలలో భవిష్యత్ ప్రణాళిక పై చర్చించారు. అనేక తీర్మానాలను పూజ్య ధర్మాచార్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.

భారతదేశం లో ధర్మానికి సమాజానికి ఆయువుపట్టు దేవాలయాలు. వ్యక్తిగతంగా భగవత్భక్తి కొరకు మాత్రమే కాక దేవాలయం శ్రద్దా కేంద్రం,హిందూ ధర్మానికి ప్రచార కేంద్రం కావాలి. ఆ దృష్ట్యా ప్రతి దేవాలయం లో వారం వారం భజన, కనీసం నెలకు ఒకసారి సామూహిక హారతి జరిగేటట్లు చూడాలి. దీనివల్ల దేవాలయానికి,దేవాలయం చుట్టుప్రక్కల నివసించే భక్తులకు అనుసంధానం ఏర్పడుతుంది. సమరసత సేవా ఫౌండేషన్ గత మూడు సంవత్సరాల కార్యక్రమాల వల్ల రాష్ట్రము లోని 13 జిల్లాలలో 300 మండలాలలో 7000 పైగా దేవాలయాలలో వారానికి ఒక భజన,నెలకు ఒకసారి సామూహిక హారతి జరుగుచున్నాయి. ఈ కార్యక్రమాల వల్ల హిందువులందరిలో సమైక్య భావన ఏర్పడుతుంది. ఇటువంటి కార్యక్రమాలు రాష్ట్రము లో అన్ని దేవాలయాల్లో జరుగునట్లు దేవాలయ ధర్మ కర్తలు, పూజారులు,హిందువులు సహకరించాలని సదస్సు విజ్ఞప్తి చేసింది.
నూతనంగా సమరసత సేవా ఫౌండేషన్ అధ్యక్షులు గా దాసరి శ్రీనివాసులు, రాష్ట్ర కార్యదర్శిగా త్రినాధ్, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా భవాని ప్రసాద్, కార్య నిర్వాహక అధ్యక్షుడు గా విష్ణు, కోశాధికారిగా రంగప్రసాద్, సహకార్యదర్శి గా కోట సునీల్ కుమార్, సభ్యులుగా డా.చిలకపాటి విజయ రాఘవాచార్యులు, శ్యాంజీ, తొండేటి హనుమంత రావు తదితరులు ఎంపిక అవడం పట్ల పలువురు హ్రార్షం వ్యక్తం చేసారు. పై కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతఙ్ఞతలు తెలియ జేశారు.

SHARE

LEAVE A REPLY