పసిడి.. రూ. 42వేల పైన!!

0
95

Tmes of Nellore – ✒కోట సునీల్ కుమార్✒పెళ్లిళ్ల సీజన్‌తో పసిడి ధర మళ్లీ పరుగులు పెడుతోంది. క్రమక్రమంగా పెరుగుతూ మళ్లీ రూ. 42వేలు దాటింది. బుధవారం రూ. 462 పెరగడంతో దేశ రాజధానిలో 10 గ్రాముల బంగారం ధర రూ. 42,339కు చేరింది. అటు వెండి కూడా నేడు పుత్తడి దారిలోనే పయనించింది. ఇవాళ ఒక్కరోజే రూ. 1,047 పెరిగి కేజీ వెండి ధర రూ. 48,652 పలికింది.

కరోనా ప్రభావంతో మార్చి త్రైమాసికంలో ఆదాయ అంచనాలను అందుకోకపోవచ్చని ప్రముఖ టెక్‌ కంపెనీ యాపిల్‌ వెల్లడించింది. ఇది అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ నేపథ్యంలో బంగారంలో పెట్టుబడులు పెట్టడమే శ్రేయస్కరమని మదుపర్లు భావిస్తున్నారు. దీంతో అంతర్జాతీయంగా ధరలు ఒక్కసారిగా పెరిగాయి. మరోవైపు దేశీయంగా పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో పసిడికి గిరాకీ పెరిగింది. ఫలితంగా దేశీయ మార్కెట్లో ఈ లోహాల ధరలకు రెక్కలొచ్చినట్లు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సీనియర్‌ అనలిస్ట్‌ తపన్‌ పటేల్‌ తెలిపారు.

SHARE

LEAVE A REPLY