శ్రీవారి సేవలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

0
220

Times of Nellore (Tirumala) – తిరుమల శ్రీవారి ఆలయం దేశానికే తలమానికం అని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కితాబిచ్చారు.తిరుమల శ్రీవారిని కేంద్రమంత్రి దర్శించుకున్నారు. శ్రీవారి అభిషేక సేవలో ఆయన పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏడాది జూన్లో శ్రీవారిని దర్శించుకుంటున్నట్లు తెలిపారు. తిరుమలలో ఉన్న ఏర్పాట్లు మరెక్కడా లేవని అన్నారు. తిరుమలలో పరిశుభ్రతను చూస్తే ఆశ్చర్యం కలుగుతోందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.

SHARE

LEAVE A REPLY