​తెలుగుప్రజలందరు సుఖసంతోషాలతో

0
1255

Times of Nellore (Tirumala) హిందూ మతాని విసృత్తంగా ప్రచారం చేయాల్సిన భాద్యత ప్రభుత్వాలపైన ఉందని తెలంగాణ మంత్రి హరీష్ రావ్ తిరుమలలో అన్నారు…ఏ రాష్ట్రంలో అయితే ప్రజల్లో భక్తిభావాలు ఎక్కువగా ఉంటాయో ఆ రాష్ట్రం సుఖసంతోషాలతో సుభిక్షంగా అభివృద్ధి చెందుతుందని ఆయన పెర్కొన్నారు…కుటుంబసభ్యులతో కలసి నిన్న తిరుమలకు వచ్చిన ఆయన, ఈ ఉదయం విఐపీ బ్రేక్ సమయంలో ఆలయంలోకి వెళ్లి మూలవిరాట్టును దర్శించుకున్నారు, అనంతరం హుండిలో కానుకలు సమర్పించి మ్రొక్కుబడులు చెల్లించారు, ఈ సందర్భంగా ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు హరీష్ రావ్ కుటుంబానికి వేదాశీర్వాచనం అందజేయగా, అధికారులు శేషవస్త్రం కప్పి తీర్థప్రసాదాలను అందజేశారు…పుష్కలంగా వర్షాలు కురిసి ఉభయ రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు జలకళతో సంతరించుకొవాలని, తెలుగుప్రజలందరు సుఖసంతోషాలతో ఉండేలా దివించాలని వేంకటేశ్వరస్వామిని వేడుకున్నట్లు హరీష్ రావ్ తెలిపారు. ..ఇక అలాగే మాజీ ఎంపి చింతామోహన్, సినీనటుడు రచయత అవసరాల శ్రీనివాస్ లు కూడా విఐపీ విరామ సమయంలో ఆలయంలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకొని మ్రొక్కులు చెల్లించారు.

SHARE

LEAVE A REPLY